తెలంగాణలో కొత్తగా 696 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఆరుగురు వైరస్ వల్ల మరణించగా.. 858 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 10,148 మంది చికిత్స పొందుతున్నారు.  

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,05,797 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 696 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 68 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఒక కేసు నమోదైంది. అదే సమయంలో 858 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు 3,735 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కేసులతో కలిపి తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,32,379కి చేరింది. అలాగే 6,18,496 మంది వైరస్ నుంచి కోలున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,148 మంది చికిత్స పొందుతున్నారు

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 35, జీహెచ్ఎంసీ 68, జగిత్యాల 21, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 15, గద్వాల 4, కామారెడ్డి 2, కరీంనగర్ 45, ఖమ్మం 82, ఆసిఫాబాద్ 1, మహబూబ్‌నగర్ 8, మహబూబాబాద్ 23, మంచిర్యాల 19, మెదక్ 4, మేడ్చల్ మల్కాజిగిరి 31, ములుగు 19, నాగర్ కర్నూల్ 4, నల్గగొండ 49, నారాయణపేట 3, నిర్మల్ 4, నిజామాబాద్ 7, పెద్దపల్లి 48, సిరిసిల్ల 18, రంగారెడ్డి 33, సిద్దిపేట 24, సంగారెడ్డి 3, సూర్యాపేట 33, వికారాబాద్ 4, వనపర్తి 6, వరంగల్ రూరల్ 6, వరంగల్ అర్బన్ 48, యాదాద్రి భువనగిరిలో 21 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

Scroll to load tweet…