Asianet News TeluguAsianet News Telugu

jn.1 variant : తెలంగాణలో పెరుగుతోన్న కరోనా కేసులు.. కొత్తగా ఆరుగురికి పాజిటివ్

కరోనా కొత్త వేరియంట్ జేన్.1 భారతదేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. కేసుల పెరుగుదల వేగం పుంజుకుంది. తాజాగా తెలంగాణలో కొత్తగా మరో 6 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

6 new corona cases reported in telangana ksp
Author
First Published Dec 21, 2023, 9:20 PM IST

కరోనా కొత్త వేరియంట్ జేన్.1 భారతదేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. కేసుల పెరుగుదల వేగం పుంజుకుంది. తాజాగా తెలంగాణలో కొత్తగా మరో 6 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 19కి చేరాయి. అలాగే కోవిడ్ నుంచి ఒకరు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

మరోవైపు.. వరంగల్ ఎంజీఎంలో కరోనా కేసులు వెలుగుచూసినట్లుగా వార్తలు రావడంతో ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. ఈ వార్తలు అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. భూపాలపల్లికి చెందిన ఓ మహిళ కరోనా లక్షణాలతో ఎంజీఎంలోని కోవిడ్ వార్డులో చేరిందని.. అలాగే మరో ముగ్గురిని కూడా అనుమానితులుగా గుర్తించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు వరంగల్ ఎంజీఎంలో 50 పడకలతో కోవిడ్ వార్డును ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. 

కాగా..  కేరళతో సహా కరోనా దేశం మొత్తం మీద కేసులు బాగా పెరిగిపోతుండటంతో జనాలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. కరోనా చేసిన నష్టాలు.. ఇప్పటికీ జనాల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక దీని భయం మనకు అక్కర్లేదు అనుకున్న సమయంలోనే మళ్లీ కరోనా వ్యాప్తి మొదలైంది. ఈ వేరియంట్ మునపటిలానే ఉంటుందా? అన్న అనుమానం జనాలను తీవ్రంగా భయపెడుతోంది. 

తాజా వేరియంట్లలో ఒకటైన జేఎన్ 1 గురించి పూర్తి సమాచారం ఇంకా అందుబాటులో లేదు. అయితే పరిశోధకులు ఇప్పటికే చెప్పిన విషయమేంటంటే? ఇది మనల్ని మరీ డేంజర్ లో ఉంచే విధంగా ప్రభావితం చేసే వైరస్ కాదు. కానీ వ్యాధులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వైరస్ యాక్టివిటీ ఇలాంటి వారిలోనే మారుతుంది.

గతంలో కొవిడ్ బారిన పడినవారు, వ్యాక్సిన్ వేయించుకున్న వారి శరీరంలోకి కూడా ఈ వైరస్ ప్రవేశించొచ్చు. వ్యాక్సిన్ వేయించుకున్నా ప్రయోజనం లేదనుకుంటే పొరపాటే. కానీ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారికి ఇది వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఇమ్యూనిటీని పెంచే ఆహారాలను తినాలి. 

దీనిలో చాలా లక్షణాలు మునుపటి కోవిడ్ లక్షణాల మాదిరిగానే ఉంటాయి. అయితే జుఎన్ 1 లో ఒక లక్షణం ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అదేంటంటే? పొట్ట ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు. అజీర్ణం, పొత్తికడుపు నొప్పి, విరేచనాలు దీనిలో ఉంటాయి.  అయితే ఈ కరోనా కొత్త వేరియంట్ కు భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అయితే దీనిపై మరిన్ని అధ్యయనాలు జరిగితే ఈ వేరియంట్ గురించి మరింత స్పష్టత వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios