గ్రేటర్ పై కరోనా పంజా: రోజు రోజుకు పెరుగుతున్న కేసులు

గ్రేటర్ హైద్రాబాద్ లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ప్రాంతంలోని పలు బస్తీలు, కాలనీల్లో కరోనా రోగులు పెరుగుతున్నారు. దీంతో స్థానికులు ఆందోళన నెలకొంది. బుధవారం నాడు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనివే 31 కేసులు కావడం గమనార్హం.

51 new Covid-19 cases reported in Telangana Hyderabad continues to be red zone

హైదరాబాద్: గ్రేటర్ హైద్రాబాద్ లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ప్రాంతంలోని పలు బస్తీలు, కాలనీల్లో కరోనా రోగులు పెరుగుతున్నారు. దీంతో స్థానికులు ఆందోళన నెలకొంది. బుధవారం నాడు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనివే 31 కేసులు కావడం గమనార్హం.

తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి.ఈ జిల్లాల్లో కేసులను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నమోదౌతున్న కరోనా కేసుల్లో ఎక్కువ భాగం జీహెచ్ఎంసీలోనే ఉండడం గమనార్హం. కొన్ని రోజుల్లో నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ ప్రాంతంలోనివే కావడం గమనార్హం.

దాదాపు వారం రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదు కావడంపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. ఈ కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు చర్యలు తీసుకొంటున్నారు. 

దిల్‌సుఖ్‌నగర్ ఆర్‌కేపురం డివిజన్ పరిధిలోని రామకృష్ణాపురం రోడ్డు నెంబర్ 6 ల నివాసం ఉండే భార్యాభర్తలకు కరోనా సోకింది.దీంతో వారిని అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల క్రితం వీరు అల్వాల్ లోని తమ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చారు. కర్మన్‌ఘాట్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో 13 నెలల చిన్నారికి కరోనా సోకింది. బుధవారం నాడు ఆ బాలికను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ చిన్నారి తల్లికి కరోనా సోకింది. తల్లి నుండి చిన్నారికి కరోనా సోకిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 

బాధితురాలు అమెరికాకు వెళ్లేందుకు ఫిబ్రవరి 21వ తేదీన కర్మన్ ఘాట్ లోని భాగ్యనగర్ కాలనీలో ఉన్న బియ్యం వ్యాపారి ఇంటి వద్దకు చేరుకొంది. బియ్యం వ్యాపారికి కరోనా సోకింది. దీంతో కుటుంబసభ్యులను పరీక్షిస్తే ఆమెకు కరోనా సోకిందని తేలింది. 

also read:తెలంగాణలో కొత్తగా 41 కేసులు, ఇద్దరి మృతి: 1,367కి చేరిన బాధితుల సంఖ్య

ఆసిఫ్‌నగర్‌లోని న్యూ కిషన్‌నగర్‌లో మరో ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ అని నిర్దారణ అయింది. వారం రోజుల క్రితం ఓ ఆటోడ్రైవర్‌కు కరోనా అని తేలింది. కాగా అతడి కుటుంబ సభ్యులు ఆరుగురికి నాలుగు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో కరోనా అని నిర్దారణ అయింది. కాగా బుధవారం అదే కుటుంబంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలిందని పోలీసులు తెలిపారు.  

మలక్‌పేట నియోజకవర్గం అక్బర్‌బాగ్‌ డివిజన్‌ ఆనంద్‌నగర్‌లోని ఓ వృద్ధుడి (70)కి కరోనా పాజిటివ్‌ అని తేలింది. జీహెచ్‌ఎంసీ అధికారుల ప్రకారం.. గత నెల 20న పూణె నుంచి రైలులో హైదరాబాద్‌కు వచ్చిన సదరు వృద్ధుడు రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో అతడిని కిమ్స్‌ హాస్పిటల్‌కు తరలించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios