Asianet News TeluguAsianet News Telugu

ఇంటిదొంగల చేతివాటం.. 500 డోసులల కోవాగ్జిన్ మాయం... !

కరోనా వ్యాక్సిన్ కొరతతో ఓ వైపు మొదటి డోసు వేసుకుని.. రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న వారు ఉంటే.. మరోవైపు అసలు మొదటి డోసు కూడా దొరక్క అవస్థ పడుతున్నవారు చాలామంది. ఈ క్రమంలో సందట్లో సడేమియా లాగా అడుగు, బొడుగు ఉన్న వ్యాక్సిన్లమీద ఇంటిదొంగలు చేతివాటం చూపిస్తున్నారు. 
 

500 doses of covaxin stolen from kondapur area hospital - bsb
Author
Hyderabad, First Published May 22, 2021, 10:06 AM IST

కరోనా వ్యాక్సిన్ కొరతతో ఓ వైపు మొదటి డోసు వేసుకుని.. రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న వారు ఉంటే.. మరోవైపు అసలు మొదటి డోసు కూడా దొరక్క అవస్థ పడుతున్నవారు చాలామంది. ఈ క్రమంలో సందట్లో సడేమియా లాగా అడుగు, బొడుగు ఉన్న వ్యాక్సిన్లమీద ఇంటిదొంగలు చేతివాటం చూపిస్తున్నారు. 

వ్యాక్సిన్లకు సరైన భద్రత కల్పించలేకపోవడంతో 500 డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్ మాయమయ్యాయి. హైదరాబాద్లోని కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 

కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో డెలివరీ వార్డులోని ఓ గదిలో ఈ వ్యాక్సిన్లను భద్రపరిచారు. ఇటీవల ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు విరామం ప్రకటించడంతో మిగిలిన వ్యాక్సిన్లను అదే గదిలో భద్రపరిచారు. బుధవారం ఆ గదిని తెరిచి చూడగా కోవాగ్జిన్ 50 వయల్స్  అంటే 500 డోసుల బాక్సు కనిపించలేదు.

కరోనాతో తల్లి పోరాటం.. పసిబిడ్డకు పాలు ఇచ్చి కాపాడిన నర్స్...

దీనిపై ఆసుపత్రి సూపర్డెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... దర్యాప్తు చేపట్టారు. ఆ గది ఇన్చార్జ్ డాక్టర్ మహేష్ కు కోవిడ్ రావడంతో తాళాలను మణి అనే వ్యక్తికి అప్పజెప్పారు. ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా  ఓ వార్డ్‌బాయ్‌ వ్యాక్సిన్‌ ఉన్న గది వైపు వెళ్లినట్లు రికార్డయింది.

అతను రెండు రోజులు ఆస్పత్రికి రావడం లేదని సమాచారం. గతంలోనూ ఓ వ్యక్తి వ్యాక్సిన్‌ దొంగిలించినట్లు తెలుస్తోంది. ఇంటి దొంగలే అదను చూసి వ్యాక్సిన్ మాయం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios