హైదరాబాద్ లో ఒక్కరోజే 50 వేల వివాహాలు

50,000 couples tie the knot in Hyderabad on Sunday
Highlights

నగరమే ఓ పెళ్ళి మండపంగా మారిన వేళ...

హైదరాబాద్ నగరం నిన్న ఆదివారం పెళ్లి సందడిలో మునిగిపోయింది.  భాజాభజంత్రీలు, పెళ్లి మంత్రాలతో నగరం మార్మోగిపోయింది.  కళ్యాణ మండపాలు సరిపోక వీధులు కూడా కళ్యాణమండపాలైపోయాయి. ఇలా హైదరాబాద్ నగరమే ఓ పెళ్లి వేధికగా మారింది. 

నిన్న ఆదివారం ఒక్క రోజే కేవలం ఒక్క హైదరాబాద్ నగరంలోనే 50 వేల జంటలు మూడు ముళ్ల బంధంతో ఏకమయ్యారంటే ఏ రేంజ్ లో పెళ్ళిల్లు జరిగాయో మీరే ఊహించుకోండి. నగరంలోని పంక్షన్ హాల్సే కాదు హోటళ్లు, బంకెట్స్ హాల్స్ కూడా పెళ్లి వేదికలుగా మారిపోయాయి. ఇవి కూడా దొరకని వారు వీధుల్లోనే పెళ్లిల్లు చేశారు. ఇక పురోహితులకు, పోటో గ్రాఫర్లకు, వంటవారికి ఎక్కడ లేని గిరాకీ ఏర్పడింది. ఒక్కక్కరు రెండు, మూడు పెళ్లిలను కూడా కవర్ చేశారు. ఇలా నగరం మొత్తం నిన్న పెళ్లి శోభను సంతరించుకుంది.

ఒక్క హైదరాబాద్ లో లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ప్రతి పట్టణం, గ్రామంలో కనీసం ఒక్క పెళ్లి జరిగాయి.ఆదివారం సెలవురోజు కావడంతో పాటు మంచి ముహూర్తం ఉండటంతో ఇలా భారీ ఎత్తున పెళ్లిళ్లు జరిగాయి.

అయితే జూలై 15 వరకూ పెళ్లిల్లకు ముహూర్తాలు ఉన్నప్పటికీ,  నిన్న అత్యంత శుభ ప్రదమైన రోజు కావడంతో అధికంగా పెళ్లిల్లు జరిగాయని పురోహితులు వ్యాఖ్యానించారు. జూలై 15 నుండి ఆషాఢ మాసం రావడంతో మళ్లీ ఆగస్టు 15 వరకూ ముహూర్తాలు ఉండవు. అదికాకుండా ఆగస్టులో విపరీతమైన వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఇప్పుడే వివాహాలు చేసి తమ బాధ్యత తీర్చయుకోవాలని పెద్దలు బావిస్తుండటం కూడా ఈ పెళ్లిల్లకు మరో కారణం. 

loader