రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మహిళల మృతి

5 killed in road accident in Telangana's Ranga Reddy
Highlights

ఆటోను ఢీకొట్టిన కారు... మరో ముగ్గురి పరిస్థితి విషయం

రంగారెడ్డి జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంచాల మండల కేంద్రానికి సమీపంలో కూరగాయలు తరలిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న యాదాద్రి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనను మరువక ముందే ఈ యాక్సిడెంట్ జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది.   

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా చెన్నారెడ్డిగూడెంకు చెందిన కొందరు మహిళలు హైదరాబాద్ కు ఓ ఆటోలో కూరగాయలు తరలిస్తున్నారు. వీరి వాహనం మంచాల మండలం లింగంపల్లి గేట్ దగ్గరకు రాగానే ఓ కారు మితిమీరిన వేగంతో వస్తూ కారును ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలు ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రమాదంలో చీమల మమత, చీమల సుజాత, ఆంబోతు అసలీ, ఆంబోతు మారుతితో పాటు ఆటో డ్రైవర్ వంగాల శ్రీను లు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వారు పండించిన కూరగాయాలను అమ్ముకునేందుకు హైదరాబాద్ కు ఆటోలో వెళ్తున్న సమయంలో వీరు మృత్యువాతపడ్డారు. 

 

loader