Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ముఖ్యమైన 5 పోలికలివే..

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు.. తెలంగాణ సీఎం ముఖ్యమంత్రికి మధ్య ఉన్న ఈ అనుబంధం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. 

5 important similarities between Revanth Reddy and YS Jagan Mohan Reddy - bsb
Author
First Published Dec 7, 2023, 7:30 AM IST

హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన పదేళ్ల తరువాత తెలంగాణ బీఆర్ఎస్ ను వద్దనుకుంది. కాంగ్రెస్ ను గద్దెనెక్కించింది. అత్యధిక మెజార్టీని కట్టబెట్టి ఎలాంటి చర్చలకూ తావివ్వకుండా.. స్పష్టంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. అలా కాంగ్రెస్ ను విజయ పథాల వైపు నడిపించి.. ఉనికితో పాటు అధికారాన్నీ అందుకునేలా చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ రెండో ముఖ్యమంత్రి అయ్యారు. 

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు నవయువకులే. రాజకీయాల్లో తల పండిన వారితో పోల్చితే చిన్నవయసులో ముఖ్యమంత్రులుగా అయినవారే. వీరిద్దరి మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. 

సెకండ్ సీఎం 
రేవంత్ రెడ్డి తెలంగాణకు రెండో ముఖ్యమంత్రి. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు రెండో ముఖ్యమంత్రి. వీరిద్దరికీ ముఖ్యమంత్రి పదవులు అంత తేలికగా రాలేదు. ఎన్నో ఏళ్లు దానికోసం ఓపికగా ఎదురు చూశారు. 

పాదయాత్ర  
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ విమాన ప్రమాదంలో మృతి చెందిన తరువాత అతనే సీఎం అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కాంగ్రెస్ అధిష్టానం అందుకు ఇష్టపడలేదు. దీంతో కాంగ్రెస్ నుంచి బైటికి వచ్చారు. సొంతంగా పార్టీ పెట్టి.. తండ్రి చనిపోయిన సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ‘ఓదార్పు యాత్ర’ పేరుతో కలిశారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీతో ప్రజల్లోకి వెళ్లారు. కానీ ఓడిపోయారు. 

ఆ తరువాత 2017, నవంబర్ 6న ‘రావాలి జగన్ కావాలి జగన్’ పేరుతో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. అలా 341 రోజులపాటు 13 జిల్లాల్లో.. 3,648 కి.మీ. దూరం నడిచారు. 2018 జనవరి 10 ఇచ్చాపురంలో యాత్ర ముగించారు. ఆ తరువాతి యేడు ఎన్నికల్లో ఘన విజయం సాధించి... ముఖ్యమంత్రి అయ్యారు. 

రేవంత్ రెడ్డి విషయానికి వస్తే.. రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కావడానికి ముందు పాదయాత్ర చేశారు. ఈ యేడాది ప్రారంభంతో ‘హాత్ సే హాత్ జోడో’ పేరుతో ఆరునెలల పాటు ఈ పాదయాత్ర సాగింది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఈ యాత్ర కొనసాగింది. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ పాదయాత్ర 2023, ఫిబ్రవరి 6న మేడారం సమ్మక్క సారలమ్మ గద్దె నుంచి మొదలయ్యింది. 

కసి పెంచిన జైలుజీవితం

అధికారంలోకి రాకముందు ఇద్దరూ జైలుకు వెళ్లివచ్చారు. వైఎస్ జగన్ ను అక్రమాస్తుల కేసులో 27 మే 2012న సీబీఐ అరెస్టు చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తండ్రి కార్యాలయాన్ని వాడుకుని అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపించింది. ఆ తరువాత బెయిలుపై విడుదలయ్యారు. ఇప్పటికీ ఈ కేసులు కొనసాగుతున్నాయి. 

మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి అవినీతి ఆరోపణలే ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వీడియోలు వెలుగులోకి రావడంతో అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత కొంతకాలం చర్లపల్లి జైలులో ఉన్నారు. విడుదలయ్యాక కసితో పోరాడారు. కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. 

రెడ్డి సామాజిక వర్గం
తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి, ఆంధ్రలోని రెడ్డి సామాజిక వర్గానికి తేడా ఉంది. దాని గురించి పక్కన పెడితే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. 

చెదరని చిరునవ్వు
వైఎస్ జగన్ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఎంత పెద్ద సమస్య అయినా.. ఆయన మొహంలో జగన్ మార్క్ నవ్వు అలాగే ఉంటుంది. రేవంత్ కూడా అంతే మొహంలో ఎప్పుడూ నవ్వు కనిపిస్తుంటుంది. అది కూడా జగన్ ను నవ్వుకు ఎక్కడో పోలిక ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది. ఒత్తిళ్లను, రాజకీయ సమస్యలను అధిగమించడానికి వీరికి ఈ నవ్వే ఆయుధమేమో.

ఇంకా చెప్పుకోవాల్సి కొన్ని పోలికలు..

ఇద్దరూ 55 యేళ్ల లోపువారే. జగన్ వయసు ఇప్పుడు 51, రేవంత్ రెడ్డికి  54 యేళ్లు. 
ఇద్దరి హెయిర్ స్టయిల్ ఒక్కలాగే అనిపిస్తుంది.
కొన్ని కొన్ని యాంగిల్స్ లో జగన్, రేవంత్ రెడ్డికి పోలికలున్నట్లు కనిపిస్తుంది. 
ఇద్దరికీ అమ్మాయిలే. 
కుటుంబం అంటే ఇద్దరికీ చాలా ఇష్టం

Follow Us:
Download App:
  • android
  • ios