కొంప ముంచిన శుభకార్యం: కంఠం గ్రామంలో 45 మందికి కరోనా పాజిటివ్

శుభకార్యం ఓ గ్రామం కొంప ముంచింది. నిజామాబాద్ జిల్లా కంఠం గ్రామంలో జరిగిన ఓ శుభకార్యం కారణంగా 45 మందికి కరోనా వైరస్ సోకింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

45 infected with Coronavirus in Kantham village of Nizamabad district

నిజామాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఓ శుభకార్యం కొంప ముంచింది. నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం కంఠం గ్రామంలో 45 మందికి కరోనా వైరస్ సోకింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 

మహారాష్ట్ర నుంచి శుభకార్యానికి వచ్చినవారి నుంచి ఈ కరోనా వైరస్ వ్యాపించినట్లు చెబుతున్నారు. కరోనా వ్యాప్తితో కంఠం గ్రామంలో అధికారులు పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించారు. అన్ని దుకాణాలను, ఇతర సంస్థలను మూసేశారు. ప్రజలెవరూ బయటకు రావద్దని ఆదేసించారు. 

ఇదిలావుంటే, రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోందన్నారు తెలంగాణ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ . అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కోసం యునైటెడ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (యూఎఫ్‌ఆర్‌డబ్ల్యూఏ) ఆధ్వర్యంలో రూపొందించిన యాప్‌ను ఆయన ఆదివారం వర్చువల్‌గా ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉందని.. జులైలో దాన్ని అధిగమిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్స్‌ కోసం భారత్‌ బయోటెక్‌ ఈనెలలో 4 లక్షల డోసులు రాష్ట్రానికి ఇచ్చేందుకు సమ్మితించిందని చెప్పారు. 

ఆస్పత్రులు కూడా ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని జయేశ్ రంజన్ వెల్లడించారు. 500 గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలు ఇప్పటికే వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు ఆసక్తి చూపినట్లు నిర్వాహకులు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios