తెలంగాణలో కోవిడ్ ఉద్ధృతి.. 4 వేలు దాటిన రోజువారీ కరోనా కేసులు, 7,22,403కి చేరిన సంఖ్య
తెలంగాణలో (corona cases in telangana) కరోనా కేసులు 4 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 1,20,215 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 4,207 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,22,403కి చేరింది
తెలంగాణలో (corona cases in telangana) కరోనా కేసులు 4 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 1,20,215 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 4,207 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,22,403కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనా బారినపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో (corona deaths in telangana) వైరస్ వల్ల మరణించిన సంఖ్య 4,067కి చేరింది. కోవిడ్ నుంచి నిన్న 1,825 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 26,633 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1645 కేసులు నమోదయ్యాయి.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 32, భద్రాద్రి కొత్తగూడెం 91, జీహెచ్ఎంసీ 1645, జగిత్యాల 49, జనగామ 30, జయశంకర్ భూపాలపల్లి 30, గద్వాల 33, కామారెడ్డి 33, కరీంనగర్ 84, ఖమ్మం 98, మహబూబ్‌నగర్ 81, ఆసిఫాబాద్ 34, మహబూబాబాద్ 63, మంచిర్యాల 80, మెదక్ 45, మేడ్చల్ మల్కాజిగిరి 380, ములుగు 22, నాగర్ కర్నూల్ 52, నల్గగొండ 84, నారాయణపేట 28, నిర్మల్ 36, నిజామాబాద్ 74, పెద్దపల్లి 87, సిరిసిల్ల 36, రంగారెడ్డి 136, సిద్దిపేట 70, సంగారెడ్డి 107, సూర్యాపేట 52, వికారాబాద్ 86, వనపర్తి 48, వరంగల్ రూరల్ 49, హనుమకొండ 154, యాదాద్రి భువనగిరిలో 78 చొప్పున కేసులు నమోదయ్యాయి.
కాగా.. Indiaలో గత 24 గంటల్లో 3,17,532 coronaకేసులు నమోదయ్యాయి. అంతేకాదు దేశంలో గత 24 గంటల్లో కరోనాతో 491 మంది మరణించారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,87,693కి చేరుకొంది.కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 19,24,051గా నమోదైంది. అంతకుముందు రోజుతో పోలిస్తే కరోనా యాక్టివ్ కేసులు 93,051 కేసులు నమోదయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో 2,23,990 రికవరీలు నమోదయ్యాయి. దేశంలో కరోనా నుండి కోలుకొన్న రోగుల సంఖ్య 3,58,07,029కి చేరుకొంది.
కరోనా యాక్టివ్ కేసులు 5.03 శాతంగా నమోదయ్యాయి. కరోనా రోగుల రికవరీ రేటు 93.69 శాతానికి తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారంగా దేశంలో ఇప్పటివరకు 9,287 Omicron కేసులు నమోదయ్యాయి. బుధవారం నుండి ఈ కేసుల్లో 3.63 శాతం పెరుగుల కన్పిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 16.41 శాతంగా నమోదైంది. వీక్లీ పాజిటివిటీ రేటు 16.06 గా నమోదైంది. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 159.67 కోట్ల వ్యాక్సిన్ అందించారు. అంతకుముందు రోజుతో పోలిస్తే కరోనా కొత్త కేసుల నమోదులో 16.41 శాతంగా నమోదైంది.గత ఏడాది మే 15న 3,11,077 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మూడు లక్షలను దాటడం ఇదే ప్రథమమని కేంద్ర ఆరోగ్య శాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి.