తెలంగాణ: 24 గంటల్లో 420 మందికి పాజిటివ్.. 6,52,135 చేరిన మొత్తం కేసులు

తెలంగాణలో కొత్తగా 420 కరోనా కేసులు నమోదవ్వగా.. ముగ్గురు మృతి చెందారు. 623 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 7,606 యాక్టివ్‌ కేసులు వున్నాయి
 

420 new corona cases reported in telangana

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 87,355 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 420 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 6,52,135కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో వైరస్ సోకి ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,841కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 623 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 6,40,688కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 7,606 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 5, భద్రాద్రి కొత్తగూడెం 8, జీహెచ్ఎంసీ 71, జగిత్యాల 13, జనగామ 4, జయశంకర్ భూపాలపల్లి 5, గద్వాల 1, కామారెడ్డి 0, కరీంనగర్ 47, ఖమ్మం 18, మహబూబ్‌నగర్ 6, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 7, మంచిర్యాల 8, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 29, ములుగు 5, నాగర్ కర్నూల్ 3, నల్గగొండ 27, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 7, పెద్దపల్లి 24, సిరిసిల్ల 14, రంగారెడ్డి 23, సిద్దిపేట 9, సంగారెడ్డి 6, సూర్యాపేట 18, వికారాబాద్ 1, వనపర్తి 2, వరంగల్ రూరల్ 8, వరంగల్ అర్బన్ 39, యాదాద్రి భువనగిరిలో 9 చొప్పున కేసులు నమోదయ్యాయి. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios