కరీంనగర్ లో కరోనా కలకలం... 40మంది ట్రైనీ పోలీసులకు పాజిటివ్

కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో కరోనా కలకలం రేగింది. 

40 trainee police infected with corona virus at karimnagar

కరీంనగర్: తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంబిస్తోంది. సామాన్యులే కాదు కరోనా కట్టడికి కృషిచేస్తున్న ప్రంట్ లైన్ వారియర్స్ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇలా కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో కరోనా కలకలం రేగింది. తాజాగా శిక్షణలో వున్న 40 మంది కానిస్టేబుళ్లు ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో అటు కరీంనగర్ జిల్లాలోనూ ఇటు పోలీస్ శాఖలోనూ భయాందోళనను రేకెత్తించింది. 

సైబరాబాద్ కమీషనరేట్ కు చెందిన 850మంది ట్రైనీ కానిస్టేబుళ్లు కరీంనగర్ లో శిక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలో వారిలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో మిగతా ట్రైనీలు, అధికారులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికయితే 40మందికి పాజిటివ్  గా నిర్దారణ అయ్యింది.  

read more   కరోనా బులిటెన్‌పై అసంతృప్తి: హైకోర్టు ముందు హాజరైన సీఎస్, వైద్యాధికారులు

ఇక రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరిస్థితిని చూస్తే పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదు కరోనా పాజిటివ్ కేసులతో అట్టుడుకుతోంది. సోమవారం 1610 మందికి కరోనా వైరస్ సోకింది. హైదరాబాదులో 531 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 57 వేలు దాటింది. మొత్తం ఇప్పటి వరకు తెలంగాణలో 57,142 కేసులు నమోదయ్యాయి. 

సోమవారం ఒక్కరోజే కోవిడ్ 19తో 9 మంది మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా వైరస్ మృతుల సంఖ్య 480కి చేరుకుంది. వరంగల్ అర్బన్ లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ జిల్లాలో 152 పాడిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదుకు దరిదాపుల్లో ఉండే రంగారెడ్డి జిల్లాలో 172 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే విధంగా మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో 113 కేసులు నమోదయ్యాయి. 

ఆదిలాబాద్ జిల్లాలో 13, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16, జగిత్యాల జిల్లాలో 12, జనగామ జిల్లాలో 18, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 20, జోగులాబం గద్వాల జిల్లాలో 34, కామారెడ్డి జిల్లాలో 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో నిన్నటి కన్నా ఈ రోజు తక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో 48 కేసులు నమోదయ్యాయి. 

ఖమ్మం జిల్లాలో 26 కేసులు నమోదు కాగా, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కేసులేమీ నమోదు కాలేదు. మహబూబ్ నగర్ జిల్లాలో 23, మహబూబాబాద్ జిల్లాలో 14, మంచిర్యాల జిల్లాలో 13, మెదక్ జిల్లాలో 12, ములుగు జిల్లాలో 32, నాగర్ కర్నూల్ జిల్లాలో 9, నల్లగొండ జిల్లాలో 26, నారాయణ పేట జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. నిర్మల్ లో కొత్తగా కేసులు నమోదు కాలేదు. 

నిజామాబాద్ జిల్లాలో 58, పెద్దపల్లి జిల్లాలో 48, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 14, సంగారెడ్డి జిల్లాలో 74, సిద్దిపేట జిల్లాలో 14, సూర్యాపేట జిల్లాలో 35, వికారాబాద్ జిల్లాలో 11, వనపర్తి జిల్లాలో 3, వరంగల్ రూరల్ జిల్లాలో 25, యాదాద్రి భువనగిరి జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి.

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios