స్కూల్ బస్సు టైర్ల కింద నలిగిపోయిన చిన్నారి

First Published 28, Jul 2018, 7:56 AM IST
4-year-old girl mowed down by school bus
Highlights

ఓ పాఠశాల బస్సు నాలుగేళ్ల చిన్నారిని బలి తీసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని మాడ్గుల్ లో ఓ ప్రైవేట్ పాఠశాలలలో చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై నుంచి బస్సు దూసుకెళ్లింది. చిన్నారి పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

మహబూబ్ నగర్: ఓ పాఠశాల బస్సు నాలుగేళ్ల చిన్నారిని బలి తీసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని మాడ్గుల్ లో ఓ ప్రైవేట్ పాఠశాలలలో చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై నుంచి బస్సు దూసుకెళ్లింది. చిన్నారి పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. మృతురాలి ఆర్ వైష్ణవి మహబూబ్ నగర్ జిల్లా అర్కపల్లిలోని పలుగు తండాకు చెందిన పి. ప్రసాద్ , పార్వతి దంపతుల కూతురు.

వైష్ణవి మాడ్గుల్ లోని సెయింట్ మేరీ స్కూల్లో నర్సరీ చదువుతోంది. ఇతరు ఐదుగురు చిన్నారులతో పాటు వైష్ణవి శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో బస్సు దిగింది. వారు బస్సు దిగగానే ఏ మాత్రం అప్రమత్తత ప్రదర్శించకుండా డ్రైవర్ బస్సును కదిలించాడు. 

దాంతో పక్కనే నించున్న వైష్ణవి మీదికి బస్సు దూసుకెళ్లింది. టైర్ల కింద ఆమె నలిగిపోయింది. వాహనాన్ని వదిలేసి బస్సు డ్రైవర్ పారిపోయాడు. బస్సు డ్రైవర్ పై, స్కూల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

loader