నాగర్ కర్నూల్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆమ్రాబాద్ మండలం ఈగలపెంటలో క్వాలిస్ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. ప్రమాద సమయంలో క్వాలిస్‌లో పది మంది ప్రయాణికులు వున్నారు. ఈ వాహనాన్ని హైదరాబాద్ మంగళ్‌హాట్‌కు చెందినదిగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.