రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం అర్దరాత్రి ఘోర రోడ్డు  ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ఘటన స్థలంలోనే మృతిచెందారు. 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ఘటన స్థలంలోనే మృతిచెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతులను నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన కేశవులు, యాదయ్య, శ్రీను, లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామస్వామిగా గుర్తించారు. ఇక, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.