ఘోర ప్రమాదం: బ్రిడ్జి నుండి పల్టీకొట్టిన బోలేరో

రెబ్బెన: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో శనివారం నాడు
జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 

రెబ్బెన మండలం సోనాపూర్ వద్ద వంతెనపై నుండి బోలేరో
వాహనం బోల్తాపడింది.దీంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న
నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

సింగరేణి ఓపెన్ కాస్ట్ పనులకు ఉపయోగించే బోలేరో
వాహనంగా పోలీసులు గుర్తించారు. 

 కైరిగూడ ఆర్చ్‌ నుంచి కైరిగూడ ఓపెన్‌ కాస్ట్ ‌వైపు వెళ్తున్న
సమయలో బొలేరో వాహనం అదుపు తప్పి వంతెన పైనుంచి
బోల్తా పడింది.