తెలంగాణలో తగ్గని కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 3801 కేసులు, జీహెచ్‌ఎంసీలో అదే జోరు
తెలంగాణలో (corona cases in telangana) కరోనా కేసుల్లో ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో 88,867 మందికి టెస్టులు నిర్వహించగా 3801 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, కొవిడ్ బాధితుల్లో 2046 మంది కోలుకోగా.. ఒకరు ప్రాణాలు (corona deaths in telangana) కోల్పోయారు.
తెలంగాణలో (corona cases in telangana) కరోనా కేసుల్లో ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో 88,867 మందికి టెస్టులు నిర్వహించగా 3801 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, కొవిడ్ బాధితుల్లో 2046 మంది కోలుకోగా.. ఒకరు ప్రాణాలు (corona deaths in telangana) కోల్పోయారు. తాజా కేసులతో తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 38,023కి పెరిగింది. మరోవైపు, జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 1570 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.16 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించగా.. 7,47,155 మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో 7,05,054 మంది కోలుకోగా.. 4078మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 43, భద్రాద్రి కొత్తగూడెం 78, జీహెచ్ఎంసీ 1570, జగిత్యాల 55, జనగామ 48, జయశంకర్ భూపాలపల్లి 29, గద్వాల 24, కామారెడ్డి 35, కరీంనగర్ 79, ఖమ్మం 139, మహబూబ్‌నగర్ 86, ఆసిఫాబాద్ 17, మహబూబాబాద్ 44, మంచిర్యాల 67, మెదక్ 27, మేడ్చల్ మల్కాజిగిరి 254, ములుగు 28, నాగర్ కర్నూల్ 38, నల్గగొండ 70, నారాయణపేట 25, నిర్మల్ 22, నిజామాబాద్ 62, పెద్దపల్లి 51, సిరిసిల్ల 31, రంగారెడ్డి 284, సిద్దిపేట 96, సంగారెడ్డి 88, సూర్యాపేట 59, వికారాబాద్ 39, వనపర్తి 40, వరంగల్ రూరల్ 75, హనుమకొండ 147, యాదాద్రి భువనగిరిలో 51 చొప్పున కేసులు నమోదయ్యాయి.
మరోవైపు భారత్ లో గత 24 గంటల్లో కొత్తగా 2,85,914 కరోనా (Coronavirus) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకు మందు రోజుతో పోలిస్తే.. దాదాపు 11.7 శాతం కేసులు పెరిగాయి. మరణాలు సైతం నిన్నటి పోలిస్తే అధికంగా నమోదయ్యాయి. నిన్న 571 కరోనా మరణాలు నమోదుకాగా, కొత్తగా 665 మంది కోవిడ్-19 తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 2,99,073 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 22,23,018 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,00,85,116 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 4,91,127 (Coronavirus) మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మహరాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. భారత్ రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 16.16 శాతంగా ఉంది.
కరోనా వైరస్ (Coronavirus) కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. అలాగే, కోవిడ్-19 పరీక్షలను పెంచడంతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం 1,63,58,44,536 కరోనా టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో మొదటి డోసు తీసుకున్న వారు 88.9 కోట్ల మంది ఉన్నారు. రెండు డోసుల కరోనా (Coronavirus) వ్యాక్సిన్ తీసుకున్న వారు 69.4 కోట్ల మంది ఉన్నారు.