తెలంగాణలో కొత్తగా 313 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు. 354 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 5,809 యాక్టివ్‌ కేసులు వున్నాయి. 

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 71,304 కరోనా పరీక్షలు నిర్వహించగా 313 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది . అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 77 కొత్త కేసులు నమోదు కాగా, వరంగల్ అర్బన్ జిల్లాలో 28, కరీంనగర్ జిల్లాలో 21 కేసులు గుర్తించారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అదే సమయంలో 354 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 6,58,689కి చేరింది. వైరస్ నుంచి 6,49,002 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,809 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణ ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 3,878కి పెరిగింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 5, జీహెచ్ఎంసీ 77, జగిత్యాల 12, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 2, గద్వాల 2, కామారెడ్డి 1, కరీంనగర్ 21, ఖమ్మం 14, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 2, మహబూబాబాద్ 8, మంచిర్యాల 7, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 18, ములుగు 2, నాగర్ కర్నూల్ 3, నల్గగొండ 16, నారాయణపేట 1, నిర్మల్ 4, నిజామాబాద్ 3, పెద్దపల్లి 16, సిరిసిల్ల 12, రంగారెడ్డి 13, సిద్దిపేట 6, సంగారెడ్డి 5, సూర్యాపేట 8, వికారాబాద్ 2, వనపర్తి 3, వరంగల్ రూరల్ 6, వరంగల్ అర్బన్ 28, యాదాద్రి భువనగిరిలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…