హోంగార్డులకు (home guards) తెలంగాణ ప్రభుత్వం (telangana govt) శుభవార్త చెప్పింది. వీరికి 30 శాతం వేతనాలు పెంచుతూ సర్కార్ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 30 శాతం జీతాల పెంపు.. దాదాపు అన్ని కేటగిరీల వారికి అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

హోంగార్డులకు (home guards) తెలంగాణ ప్రభుత్వం (telangana govt) శుభవార్త చెప్పింది. వీరికి 30 శాతం వేతనాలు పెంచుతూ సర్కార్ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జూన్ నుంచి పెంచిన వేతనాలను అమలు చేస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 30 శాతం జీతాల పెంపు.. దాదాపు అన్ని కేటగిరీల వారికి అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

గౌరవ వేతనం/ ప్రోత్సాహకం రూపంలో వేతనం పొందుతున్న ఉద్యోగులు, పంచాయతీరాజ్‌ ప్రజాప్రతినిధులకు కూడా వేతనాల పెంపును వర్తింపజేయాలని సర్కార్ గతంలోనే నిర్ణయించింది. ఈ జాబితాలో హోంగార్డులు, అంగన్‌వాడి వర్కర్లు, అంగన్‌వాడి అసిస్టెంట్లు, గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌ఏలు), విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్లు (వీఏవోలు), ఆశ వర్కర్లు, సెర్ప్‌ సిబ్బందితో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉన్నారు