నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో వైద్యం వికటించి మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భగ్గుమన్న బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో దారుణం జరిగింది. వైద్యం వికటించి మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మఠంపల్లి మండలం బిల్యానాయక్ తండాకు చెందిన బానోత్ రమేష్ కొడుకు శివ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో అతనిని తల్లిదండ్రులు హుజూర్‌నగర్ పట్టణంలోని బాబు అనే ఆర్ఎంపీ వైద్యుడికి వద్దకు తీసుకొచ్చారు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్ ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు.
అయితే కాసేపటికే చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు . దీంతో భగ్గుమన్న బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆర్ఎంపీ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆర్ఎంపీపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
