నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని రామాలయంలో రథాన్ని తరలిస్తుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

నల్గొండ జిల్లాలో (nalgonda district) విషాదం చోటు చేసుకుంది. నాంపల్లి మండలం కేతపల్లిలోని రామాలయంలో విద్యుత్ షాక్‌తో (electric shock) ముగ్గురు మృతి చెందారు. రథాన్ని తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో ఈ ఘటన జరిగింది. దీంతో వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒకేసారి ముగ్గురి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.