హైదరాబాద్: ఈఎస్‌ఐ స్కాంలో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. తేజ ఫార్మా ఎండి రాజేశ్వర్ రెడ్డి చర్లపల్లి ఫార్మాసిస్ట్ లావణ్య వరంగల్ జేడీ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ఉద్యోగి పాషాలను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు.. ప్రవేట్ హాస్పిటల్ కు మందులు తరలించార న్న ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. 
పెద్ద మొత్తంలో esi మందులను ప్రవేట్ హాస్పిటల్ కు తరలించారని  విచారణలో గుర్తించారు. 


ఈ కుంభకోణంలో నిందుతులను ఒక్కరొక్కరుగా ఏసీబీ అదుపలోకి తీసుకుంటుంది. తాజా అరెస్ట్‌తో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 15కు చేరింది. ఈ కేసులో ప్రదాన నిందుతులను కోర్టు అనుమతితో ఏపీబీ రెండు రోజుల పాటు విచారించింది. డైరెక్టర్‌ దేవికారాణితోపాటు ఆరుగురిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. పటాన్‌చెరు, చర్లపల్లి, వనస్థలిపురం, ఆర్‌సీపురం డిస్పెన్సరీ.. మందుల విక్రయాల్లో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ ఔషదాలను  ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించినట్లుగా గుర్తించారు. 

పెద్దమొత్తంలో ఈఎస్‌ఐ మందులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలింలించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ మందులను అక్రమంగా కొనుగోలు చేసిన ప్రైవేట్‌ ఆస్పత్రులపై కూడా కేసు నమోదు చేసేందుకు ఏసీబీ అధికారులు పన్నద్దమవుతున్నారు.

ఈ కేసులో రోజురోజుకు ఏపీబీ అధికారులు  దూకుడు పెంచుతున్నారు. కేసుతో సంబంధం ఉన్నవారిని  ఒక్కరొక్కరిగా అరెస్ట్ చేస్తూ కుంభకోణం అసలు విలువను తెల్చే పనిలో పడ్డారు .విస్తృతంగా తనిఖీలు చేపడుతూ కేసును లోతుగా పరిశీలిస్తోంది ఏపీబీ.   ఔషధాల కొనుగోలులో రూ. 700 కోట్ల మేర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సోదాలను ముమ్మరం 
చేసింది.