కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో  చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల కుర్మల్ గూడకు చెందిన హన్మంతు- చంద్రకళ దంపతులు. వీరికి మంజుల అనే కుమార్తె ఉంది. శుక్రవారం అర్థరాత్రి ముగ్గురు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల కారణంగానే ప్రాణాలు తీసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు.

స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.