నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వల్ లో బొలేరో వాహనం బోల్తా పడింది.ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
నర్వ: NarayanPet జిల్లాలోని నర్వ మండలం కల్వల్ గ్రామం వద్ద మంగళవారం నాడు జరిగిన Road accident లో Three మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొంది.
Gadwalలోని జమ్ములమ్మ Templeకి వెళ్లున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
