ఎమర్జెన్సీ లైట్‌లో మూడు కిలోల బంగారం: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కడప వాసి అరెస్ట్
శంషాబాద్ ఎయిర్ పోర్టులో దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకుడి నుండి మూడు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకుడి నుండి బుధవారంనాడు మూడు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 1.80 కోట్లుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపకు చెందిన ప్రయాణీకుడు దుబాయి నుండి హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. ఈ ప్రయాణీకుడి వద్ద ఉన్న ఎమర్జెన్సీ లైట్ లో బంగారాన్ని గుర్తించారు అధికారులు. దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసిన సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. ఈ ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
మూడు కిలోల బంగారాన్ని ఈ ప్రయాణీకుడు ఎక్కడికి తరలిస్తున్నారనే విషయమై కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో కూడ శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం తరలిస్తూ పలువురు పట్టుబడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 14న శంషాబాద్ ఎయిర్ పోర్టులో 14 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. సూడాన్ నుండి వచ్చిన 23 మంది ప్రయాణీకుల నుండి 14 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 25న అరెస్ట్ చేశారు. రూ. 47 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
2022 నవంబర్ 12న ఐదున్న కిలోల బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణీకుల నుండి కస్టమ్స్ అధికారుల సీజ్ చేశారు. అమిర్ ఖాన్, మహ్మద్ ఖురేషి నుండి అధికారులు బంగారాన్ని సీజ్ చేశారు. పేస్ట్ రూపంలోకి బంగారాన్ని మార్చి తరలిస్తున్న సమయంలో అధికారులు సీజ్ చేశారు.
also read:హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 14 కిలోల బంగారం సీజ్: నలుగురు అరెస్ట్
2022 అక్టోబర్ 06వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏడు కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.3.5 కోట్లుగా అధికారులు గుర్తించారు. 2022 ఆగష్టు 14వ తేదీన హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ. 13.63 లక్షల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు. లోదుస్తుల్లో ప్రయాణీకులు బంగారాన్ని తరలించారు.