ముగ్గురు హైదరాబాద్ పోలీసుల సాహసం.. ఐదు నిమిషాలు లేటైతే యువతి మానప్రాణాలు బలే

3 hyderabad cops saves women from rape
Highlights

గత కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న బ్రిజేష్‌ కుమార్‌ ఓ యువతిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తుండగా ముగ్గురు కానిస్టేబుళ్లు సాహసంతో పట్టుకున్నారు

నిన్న తిరుమలగిరిలో వరుస అత్యాచారాలకు పాల్పడుతున్న మాజీ జవాన్ బ్రిజేష్ కుమార్ యాదవ్ పోలీసులకు చిక్కాడు. గత కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న బ్రిజేష్‌ కుమార్‌ ఓ యువతిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తుండగా ముగ్గురు కానిస్టేబుళ్లు సాహసంతో పట్టుకున్నారు.

తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో పనిచేసే చంద్రశేఖర్, హరిరామ శర్మ, నరేంద్ర అనే కానిస్టేబుళ్లు పెట్రోలింగ్‌లో భాగంగా అమ్ముగూడ రైల్వే ట్రాక్ సమీపంలో వెళుతున్నారు.. మద్యపానం సేవించే వారిని గమనిస్తూ.. ఖో.. ఇ.. ఇమామ్ దర్గ సమీపంలో కానిస్టేబుల్ చంద్రశేఖర్ వాహనం దిగి నడుస్తున్నాడు... ఆ సమయంలో ముగ్గురు వ్యక్తుల మధ్య పెనుగులాట జరుగుతున్నట్లు గమనించాడు..

ఆ సమయంలో ‘‘ నన్ను వదిలేయండి... ఎవరైనా కాపాడండి’’ అనే అరుపులు వినిపించాయి.. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మిగిలిన కానిస్టేబుళ్లను అప్రమత్తం చేశాడు చంద్రశేఖర్.. ఓ 19 ఏళ్ల యువతిని ఓ  వ్యక్తి పొదల్లోకి లాక్కెళుతున్నాడు.. అతనిని దూరం నుంచి గమనించిన చంద్రశేఖర్ ఆ వ్యక్తి సీరియల్ రేపిస్ట్ బ్రిజేష్ కుమార్ యాదవ్‌గా గుర్తించాడు.. వెంటనే వారిపై ముగ్గురు కానిస్టేబుళ్లు దాడి చేయడంతో.. వారు పారిపోయారు.

ఈ క్రమంలో హరి తన లాఠీని బ్రిజేశ్‌ కాళ్లపై విసిరాడు.. అయినప్పటికీ అతను 20 అడుగుల కిందకు దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు.. చంద్రశేఖర్ అతన్ని వెంబడించి పట్టుకున్నాడు. తాము రావడం ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఆ యువతి మాన, ప్రాణాలు పోయేవని కానిస్టేబుళ్లు మీడియాకు వివరించారు. ధైర్య సాహసాలు ప్రదర్శించి.. యువతిని కాపాడటమే కాకుండా కరడుగట్టిన నేరస్థుణ్ణి  పట్టించిన ముగ్గురిని ఉన్నతాధికారులు అభినందించారు.

loader