Asianet News TeluguAsianet News Telugu

ప్రారంభమైన రెండో విడత పంచాయతీ పోలింగ్

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 10,668 మంది సర్పంచ్‌, 63,380 మంది వార్డ్‌ సభ్యుల పదవి కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

2nd Phase of telangana panchayat polling today
Author
Hyderabad, First Published Jan 25, 2019, 8:04 AM IST

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 10,668 మంది సర్పంచ్‌, 63,380 మంది వార్డ్‌ సభ్యుల పదవి కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

రెండో విడతలో మొత్తం 4,137 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడగా వాటిలో 788 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఏడు సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 29,964 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది..

అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలు, వివాదాస్పద పంచాయతీల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు

Follow Us:
Download App:
  • android
  • ios