హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు ఇటీవల తగ్గినట్లే తగ్గి తాజాగా మళ్లీ పెరిగాయి.  గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,072 పాజిటివ్  కేసులు నమోదయినట్లు తాజాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే ఈ పాజిటివ్ కేసుల కంటే ఎక్కువగా 2,259 మంది ఈ మహమ్మారి బారినుండి సురక్షితంగా బయటడిపడి రికవరీ అయినట్లు తెలిపారు. దీంతో ఇప్పటివరకే మొత్తం 1,89,283 మంది కరోనా బారినపడగా ఇప్పటికే 1,58,690 మంది రికవరీ అయ్యారు. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 29,477 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

ఇక గత 24గంటల్లో ఈ మహమ్మారి బారినుండి బయటపడలేక తొమ్మిదిమంది మృతిచెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 1116కి చేరింది. దేశవ్యాప్త మరణాల రేటు 1.57శాతంగా వుంటే తెలంగాణలో మాత్రం 0.58శాతంగా వున్నట్లు తాజా ప్రకటన ద్వారా తెలుస్తోంది.

రికవరీ విషయానికి వస్తే జాతీయస్థాయిలో 82.88శాతం వుంటే రాష్ట్రంలో 83.83శాతంగా వుంది. గత 24గంటల్లో 54వేల పైచిలుకు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య 29,40,642 చేరింది. 

read more గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి: సీసీఎంబీ కీలక సర్వే

జిల్లాల వారిగా చూసుకుంటే జిహెచ్ఎంసీ పరిధిలో 283, కరీంనగర్ 109, మేడ్చల్ 160, నల్గొండ 139, రంగారెడ్డి 161, భద్రాద్రి కొత్తగూడెం 85, ఖమ్మం 92, మహబూబాబాద్ 60, నిజామాబాద్ 72, సిరిసిల్ల 53, సిద్దిపేట 78, సూర్యాపేట 72, వరంగల్ అర్బన్ లో 85 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో మాత్రం కేసుల సంఖ్య కాస్త తక్కువగానే వుంది.