తెలంగాణ: 24 గంటల్లో 2983 మందికి పాజిటివ్.. 7,14,639కి చేరిన కేసుల సంఖ్య
తెలంగాణలో (telangana corona cases) కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,07,904 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,983 పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
తెలంగాణలో (telangana corona cases) కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,07,904 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,983 పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,14,639కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు (corona deaths in telangana) మరణించారు. దీంతో తెలంగాణలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,062కి చేరింది. వైరస్ బారి నుంచి నిన్న 2,706 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 22,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా ఇవాళ 1206 కేసులు నమోదయ్యాయి.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 25, భద్రాద్రి కొత్తగూడెం 65, జీహెచ్ఎంసీ 1206, జగిత్యాల 31, జనగామ 22, జయశంకర్ భూపాలపల్లి 15, గద్వాల 26, కామారెడ్డి 27, కరీంనగర్ 46, ఖమ్మం 77, మహబూబ్‌నగర్ 47, ఆసిఫాబాద్ 17, మహబూబాబాద్ 42, మంచిర్యాల 75, మెదక్ 34, మేడ్చల్ మల్కాజిగిరి 259, ములుగు 9, నాగర్ కర్నూల్ 34, నల్గగొండ 61, నారాయణపేట 17, నిర్మల్ 18, నిజామాబాద్ 76, పెద్దపల్లి 81, సిరిసిల్ల 21, రంగారెడ్డి 227, సిద్దిపేట 31, సంగారెడ్డి 96, సూర్యాపేట 36, వికారాబాద్ 50, వనపర్తి 22, వరంగల్ రూరల్ 26, హనుమకొండ 118, యాదాద్రి భువనగిరిలో 46 చొప్పున కేసులు నమోదయ్యాయి.
మరోవైపు భారత్‌లో గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,38,018 కరోనా కేసుల నమోదయ్యాయి. అయితే గత రెండు రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గడం కొద్దిగా ఊరట కలిగించే అంశమని చెప్పాలి. తాజాగా 310 కరోనాతో మంది మరణించారు. దీంతో కరోనాతో మొత్తం మరణాల సంఖ్య 4,86,761కి చేరింది. నిన్న కరోనా నుంచి 1,57,421 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య 3,53,94,882 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17,36,628 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 14.43 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు.. 94.09 శాతం, యాక్టివ్ కేసులు.. 4.62 శాతంగా ఉంది. ఇక, శనివారం (జనవరి 15) రోజున దేశంలో 16,49,143 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 70,54,11,425కి చేరినట్టుగా తెలిపింది.
మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 79,91,230 డోసుల వ్యాక్సిన్ (vaccination) పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,58,04,41,770కి చేరింది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. ఇప్పటివరకు దేశంలో 8,891 ఒమిక్రాన్ (omicron) కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా తెలిపింది.