తెలంగాణలో భారీగా తగ్గిన కేసులు: కొత్తగా 2,982 మందికి పాజిటివ్.. రికవరీల్లో రికార్డు
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడ్డట్టే కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,982 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,74,026కి చేరింది
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడ్డట్టే కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,982 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,74,026కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ వల్ల 21 మంది మరణించగా.. ఇప్పటి వరకు తెలంగాణలో మృతుల సంఖ్య 3,247కి చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇవాళ 1,00,677 మందికి కోవిడ్ పరీక్షలు చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 36,917 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. ఈ రోజు నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 436 కేసులు వెలుగుచూశాయి.
మరోవైపు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగానే ఉంటోంది. ఇవాళ 3,837 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో 90.8 శాతం రికవరీ రేటు ఉండగా... రాష్ట్రంలో ఇది 93 శాతంగా ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు సైతం జాతీయ సగటు (1.2శాతం)తో పోలిస్తే రాష్ట్రం మెరుగైన స్థానంలో వున్నట్లు (0.56శాతం) పేర్కొంది.
Also Read:కరోనాతో తల్లి మృతి: బిల్లు కట్టాలంటూ ఆసుపత్రి వేధింపులు.. యువకుడి ఆత్మహత్య
మరోవైపు రాష్ట్రంలో లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్‌లో సీపీలు అంజనీకుమార్, సజ్జనార్, మహేశ్ భగవత్‌లు నేరుగా రంగంలోకి దిగారు. అటు జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాల్లోనూ లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల సహా పలు చోట్ల అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నవారిని పోలీసులు ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు