తెలంగాణలో కొత్తగా 296 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మృతి చెందారు. 322 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 5,324 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 69,833 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 296 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 74 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 29, వరంగల్ అర్బన్ జిల్లాలో 22 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అదే సమయంలో కోవిడ్ నుంచి 322 మంది కోలుకోగా, ఒకరు మరణించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,61,302కి చేరింది. ఇప్పటివరకు తెలంగాణలో డిశ్చార్జ్‌ల సంఖ్య 6,52,08కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,324 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణంతో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,893కి పెరిగింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 8, జీహెచ్ఎంసీ 74, జగిత్యాల 13, జనగామ 4, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 2, కరీంనగర్ 29, ఖమ్మం 13, మహబూబ్‌నగర్ 5, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 6, మంచిర్యాల 8, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 15, ములుగు 4, నాగర్ కర్నూల్ 3, నల్గగొండ 15, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 5 , పెద్దపల్లి 9, సిరిసిల్ల 10, రంగారెడ్డి 12, సిద్దిపేట 8, సంగారెడ్డి 1, సూర్యాపేట 6, వికారాబాద్ 0, వనపర్తి 4, వరంగల్ రూరల్ 8, వరంగల్ అర్బన్ 22, యాదాద్రి భువనగిరిలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…