జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ... హైదరాబాద్ లో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఎన్నికల వేళ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశమే. 

28th november telangana corona cases

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నగరప్రజలు గుంపులు గుంపులుగా ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్నా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా  తగ్గుతున్నాయి. ఒక్క నగరంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా చాలా తక్కువ కేసులు నమోదవడం కాస్త ఊరటనిచ్చే అంశమే. 

తాజాగా గత 24గంటల్లో (గురువారం రాత్రి 8గంటల నుండి శుక్రవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 41,991మందికి టెస్టులు చేస్తే కేవలం 753మందికి మాత్రమే పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో చేపట్టిన మొత్తం టెస్టుల సంఖ్య 53,74,141కు చేరితే కేసుల సంఖ్య 2,68,418కి చేరాయి. 

 ఇక ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 952 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,56,330కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 10,637 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1451కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 93.7శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 95.49 శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 133కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 78, రంగారెడ్డి 71, భద్రాద్రి కొత్తగూడెం 36, కరీంనగర్ 47, ఖమ్మం 38,  సంగారెడ్డి 18, సిద్దిపేట 10, సూర్యాపేట 22, వరంగల్ అర్బన్ 33, నల్గొండ 38, మంచిర్యాల 18, జగిత్యాల 22, పెద్దపల్లి 15, సిరిసిల్ల 19, నిజామాబాద్ 14, ములుగు 14 కేసులు నమోదయ్యాయి.  ఇక నారాయణపేట జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా బయటపడలేదు. 

పూర్తి వివరాలు:

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios