తెలంగాణ (Telangana)లో కొత్తగా 280 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోలేదు. 206 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,563 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 37,926 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 280 పాజిటివ్‌ కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 6,81,587కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో వైరస్ వల్ల ప్రాణాలు (corona deaths in telangana) కోల్పోయినవారి సంఖ్య 4,025కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 206 మంది కోలుకున్నారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 6,73,999కి చేరుకుంది. తెలంగాణలో ప్రస్తుతం 3,563 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరోవైపు తెలంగాణలో కరోనా (coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron) విస్తరిస్తోంది. తాజాగా రాష్ట్రంలో 5 కేసులు వెలుగుచూశాయి. వీటితో కలిపి తెలంగాణలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 67కి చేరుకుంది. తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 143 మంది శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కొవిడ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా నలుగురు ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో వారి నమూనాలను అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 12,410 మంది తెలంగాణకు వచ్చారు.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 4, జీహెచ్ఎంసీ 167, జగిత్యాల 0, జనగామ 1, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 3, ఖమ్మం 5, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 6, మంచిర్యాల 1, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 24, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 2, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 2, పెద్దపల్లి 3, సిరిసిల్ల 0, రంగారెడ్డి 29, సిద్దిపేట 4, సంగారెడ్డి 6, సూర్యాపేట 4, వికారాబాద్ 0, వనపర్తి 0, వరంగల్ రూరల్ 2, హనుమకొండ 4, యాదాద్రి భువనగిరిలో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి

Scroll to load tweet…