Asianet News TeluguAsianet News Telugu

యువతి ప్రాణం తీసి మూర్ఛ.. బ్రష్ చేస్తుండగా సంపులో పడి మృతి..

హైదరాబాద్ లో ఓ యువతి మూర్ఛ వచ్చి.. సంపులో పడిపోవడంతో మృతి చెందింది. బ్రష్ చేసుకుంటుండగా ఒక్కసారిగా మూర్ఛ రావడంతో ఈ ప్రమాదం జరిగింది. 

26-year-old woman faints in water tank and dies, hyderabad - bsb
Author
First Published Mar 21, 2023, 11:29 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇటీవల హఠాత్ మరణాల జాబితాలో మరో మృతి నమోదయ్యింది. అయితే, ఇది గుండెపోటో, బ్రెయిన్ స్ట్రోకో కాదు.. మూర్చ రావడంతో హాఠాత్తుగా చనిపోయింది ఓ యువతి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి ఉదయం బ్రష్ చేసుకుంటుండగా మూర్ఛ వచ్చింది. దీంతో అక్కడే ఉన్న సంపులో పడిపోయింది. ఊపిరి ఆడక మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ గిరీష్ ఈ మేరకు వివరాలు తెలిపారు..

మియాపూర్ లోని మయూరినగర్ స్వదర్ గృహ అనాథాశ్రమంలో  లునావత్ నిర్మల (26) అనే యువతి ఉంటోంది. ఆమె సూర్యాపేట జిల్లా గాంధీనగర్ లోని బాచనాయక్ తండాకు చెందిన యువతి. నిర్మలకు మూర్ఛవ్యాధి ఉండేది. సోమవారం ఉదయం ఆమె బ్రష్ చేసుకుంటోంది. ఈ సమయంలో మూర్ఛ వచ్చింది. దీంతో ఒక్కసారిగా పక్కనే ఉన్న సంపులో పడిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో.. అది ఎవ్వరూ చూడలేదు. దీంతో సంపులో మునిగిపోయి చనిపోయింది. 

వికారాబాద్‌లో ఓ వ్యక్తి పేరుతో 38 బ్యాంకు ఖాతాలు.. ఇంటి లోన్ కోసం వెళ్లి షాక్ తిన్న వ్యక్తి..!

కాసేపటికి నిర్మల కోసం ఆశ్రమంలో చూస్తే కనిపించలేదు. దీంతో ఆశ్రమ సిబ్బంది ఆమె కోసం వెతికారు. చివరికి అనుమానంతో సంపులో చూడగా.. అక్కడ మునిగిపోయి కనిపించింది. వెంటనే బైటికి తీసి చూడగా.. అప్పటికే ఆమె మృతి చెందింది. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిమీద మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కూడా తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి.. డాన్స్ చేస్తూ చేస్తూ..  ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ ఘటన వెలుగు చూడడంతో స్థానికంగా విషాదం నెలకొంది.  అతడు సురేంద్ర కుమార్ దీక్షిత్.. తపాలా శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఓ ఈవెంట్లో సురేంద్ర కుమార్ దీక్షిత్  డాన్స్ చేస్తూ.. హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా… అతనికి గుండెపోటు సడన్ గా గుండెపోటు రావడంతో.. చనిపోయాడని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  అందులో సురేంద్ర కుమార్ దీక్షిత్  ఓ పాటకు తన స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తున్నాడు. చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 

దీంతో ఆయనతోపాటు అప్పటివరకు డాన్స్ చేస్తున్న వారు అతనికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు.  అయినా ఫలితం లేకపోయింది.  ఇదంతా ఆ వీడియోలో కనిపిస్తోంది. భోపాల్ లోని మేజర్ ధ్యాన్ చంద్ హాకీ స్టేడియంలో 34వ ఆలిండియా పోస్టల్ హాకీ టోర్నమెంట్ ను తపాల శాఖ నిర్వహించింది. మార్చి 13 నుంచి 17 వరకు ఈ టోర్నమెంట్ జరిగింది. అయితే, ఆఖరి మ్యాచ్ మార్చి 17న జరిగింది. దాని కంటే  ముందు రోజు మార్చి 16వ తేదీన తపాలా శాఖ కార్యాలయం ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తపాల శాఖ ఉద్యోగి అయిన  సురేంద్ర కుమార్ దీక్షిత్ ఉత్సాహంగా పాల్గొన్నారు. తోటి ఉద్యోగులతో కలిసి ఓ పాటకు నృత్యం చేశాడు. అలా చేస్తూనే హఠాత్తుగా ప్రాణాలు విడిచాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios