తెలంగాణలో ఆదివారం కూడా రికార్డు స్ధాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ కొత్తగా 237 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 4,974కి చేరింది. అలాగే వైరస్ కారణంగా ముగ్గురు  మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 185కి చేరుకుంది.

తెలంగాణలో ఆదివారం కూడా రికార్డు స్ధాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ కొత్తగా 237 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 4,974కి చేరింది. అలాగే వైరస్ కారణంగా ముగ్గురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 185కి చేరుకుంది.

ప్రస్తుతం తెలంగాణలో 2,412 మంది వైరస్ బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 2,377 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇవాళ ఒక్క హైదరాబాద్‌లోనే 195 మందికి కరోనా సోకగా, మేడ్చల్‌ 10, రంగారెడ్డి, 8, సంగారెడ్డి 5, మంచిర్యాలలో 3, వరంగల్, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో రెండేసి కేసులు, వరంగల్ (రూ), మెదక్, సిరిసిల్ల, ఆదిలాబాద్, సిద్ధిపేట, యాదాద్రిలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. 

Also Read:ఈటల ఓఎస్డీకి కరోనా: నిన్నా, మొన్నా రాజేందర్‌తోనే ... ఆందోళనలో మంత్రి కుటుంబం

నిత్యం ప్రజలతో ఉండే ప్రజా ప్రతినిధులకు సైతం కోవిడ్ 19 సోకుతుండటంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఓఎస్డీ గంగాధర్‌కు కరోనా సోకడంతో ఆ శాఖలో కలకలం రేపుతోంది.

నిన్న, మొన్న మంత్రి ఈటలతోనే ఓఎస్డీ వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆదివారం కూడా సీఎం కేసీఆర్‌ సమావేశంలో మంత్రి ఈటల పాల్గొన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్‌కి కరోనా సోకింది.

Also Read:తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా

అలాగే తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు పీఏకు పాజిటివ్‌గా తేలడంతో మంత్రి కుటుంబం హోం క్వారంటైన్‌లో ఉంటోంది. మరోవైపు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆయన భార్య, డ్రైవర్, గన్‌మెన్, వంట మనిషికి సైతం కరోనా సోకడంతో అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి