సిద్దిపేట:దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో 23 మంది బరిలో ఉన్నారు. 11 మంది నామినేషన్లను ఉపసంహరించుకొన్నారు. స్క్యూట్నీలో 12 నామినేషన్లను తిరస్కరించారు.

దుబ్బాక ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగిసింది. మొత్తం 46 నామినేషన్లు దాఖలు చేశారు.  వీరిలో 15 మంది ఇండిపెండెండ్ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. ఎనిమిది మంది పలు పార్టీల తరపున పోటీలో ఉన్నారు.

also read:క్రిమినల్ కేసులు లేవు: ఎన్నికల అఫిడవిట్‌లో దుబ్బాకలో టీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్ధి సుజాత

దుబ్బాక అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా సోలిపేట సుజాత, కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్ రావు, ఆలిండియా ఫార్వర్ఢ్ బ్లాక్ అభ్యర్ధిగా కత్తి కార్తీక, శ్రమజీవి పార్టీ నుండి జాజుల భాస్కర్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున సుకురి ఆశోక్ , ఇండియా ప్రజా బంద్ పార్టీ నుండి సునీల్ బరిలో నిలిచారు.

ఇండిపెండెంట్ అభ్యర్ధులుగా అండర్ప్ సుదర్శన్, రవితేజగౌడ్, అన్న రాజ్, కంటే సాయన్న, కొట్టాల యాదగిరి ముదిరాజ్, కోట శ్యామ్ కుమార్, వేముల విక్రం రెడ్డి,బండారు నాగరాజ్, పీఎం బాబు, బుట్టన్నగారి మాధవరెడ్డి, మోతె నరేష్, రేపల్లే శ్రీనివాస్, వడ్ల మాధవాచారి, సిల్వెరి శ్రీకాంత్ బరిలో నిలిచారు.

ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు.