లవ్ మ్యారేజీ: సినీ ఫక్కిలో వివాహిత కిడ్నాప్

22 year old woman kidnapped in Hyderabad
Highlights

లవ్ మ్యారేజీ చేసుకొన్న కూతురి కిడ్నాప్


హైదరాబాద్: ప్రేమించి పెళ్ళి చేసుకోవడం అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అయితే పెద్దలను ఎదరించిన ఆ యువతి తాను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకొంది. భర్తతో కలిసి హైద్రాబాద్‌లో నివాసం ఉంటుంది.  ఇష్టం లేని పెళ్ళి చేసుకొన్న కూతురును  సినీ ఫక్కిలో కిడ్నాప్ చేశారు. ఈ ఘటన  హైద్రాబాద్‌ కుషాయిగూడలో చోటు చేసుకొంది.

కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌కు చెందిన  పప్పుల రుచితను  ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో అరుగుల ఆనంద్ అనే యువకుడు ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు.  ఈ పెళ్ళికి పెద్దలు ఇష్టపడలేదు. దీంతో ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకొన్నాడు.  ఈ విషయం తెలిసిన రుచిత తల్లిదండ్రులకు ఈ విషయం నచ్చలేదు.  ఆనంద్ కుటుంబసభ్యులతో  రుచిత హైద్రాబాద్ కుషాయిగూడలో నివాసం ఉంటుంది. జూన్  14వ తేదిన  ఆనంద్ ఇంట్లోలేని సమయంలో  రుచిత తండ్రి శ్రీధర్, తల్లి భవాని, మరో  ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు  ఆనంద్ ఇంటికి వచ్చి రుచితను తీసుకెళ్ళారు.

ఆనంద్ కుటుంసభ్యులపై దాడికి పాల్పడి  రుచితను  కారులో  కిడ్నాప్ చేశారని  ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  రుచితను కిడ్నాప్ చేసే సమయంలో కారును  అతివేగంగా అక్కడి నుండి తీసుకెళ్ళారు. కారును  తీసుకెళ్ళే సమయంలో  సినిమాల్లో చూపించే విధంగా కారుతో ఫీట్లు చేయించారని స్థానికులు చెబుతున్నారు.  ఆనంద్ ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు  పోలీసులు కుషాయిగూడ ఎస్ఐ చంద్రశేఖర్ చెప్పారు.

loader