మౌలిక సదుపాయాల అభివృద్ది పనుల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో తిరుగవలసిన మొత్తం 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
హైదరాబాద్: నగరంలోని రైల్వే ప్రయాణికులకు అలర్ట్. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ది పనుల నేపథ్యంలో నగరంలో తిరుగవలసిన మొత్తం 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 26 నుంచి జులై 2 వరకు ఈ సర్వీసులను రద్దు చేసినట్టుగా పేర్కొంది. వివిధ రకాల మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. రైళ్ల రద్దు వల్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణాను ఎంచుకోవాలని సూచించింది.
రద్దైన ఎంఎంటీఎస్ రైళ్లు..
1. 47129- లింగంపల్లి-హైదరాబాద్
2. 47132-లింగంపల్లి-హైదరాబాద్
3. 47133- లింగంపల్లి-హైదరాబాద్
4.47135- లింగంపల్లి-హైదరాబాద్
5.47136- లింగంపల్లి-హైదరాబాద్
6.47105- హైదరాబాద్- లింగంపల్లి
7.47108- హైదరాబాద్- లింగంపల్లి
8.47109- హైదరాబాద్- లింగంపల్లి
9.47110- హైదరాబాద్- లింగంపల్లి
10.47112- హైదరాబాద్- లింగంపల్లి
11.47165- ఉమ్దానగర్- లింగంపల్లి
12.47189- లింగపల్లి-ఫలక్‌నుమా
13. 47178- లింగంపల్లి-ఉమ్దానగర్
14. 47179- లింగపల్లి-ఫలక్‌నుమా
15.47158- ఫలక్‌నుమా- లింగపల్లి
16. 47211- ఉమ్దానగర్- లింగంపల్లి
17. 47212- లింగంపల్లి-ఉమ్దానగర్
18. 47214- ఉమ్దానగర్- లింగంపల్లి
19. 47177- రామచంద్రపురం- ఫలక్‌నుమా
20. 47156- ఫలక్‌నుమా- లింగపల్లి
21. 47157- ఉమ్దానగర్- లింగంపల్లి
22. 47181- లింగంపల్లి-ఉమ్దానగర్
