తెలంగాణలో 5 వేలు దాటిన కేసులు: కొత్తగా 219 మందికి పాజిటివ్, ఇద్దరి మృతి
తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా రోజుకు 200 చొప్పున కేసులు నమోదవుతున్నట్లుగానే.. సోమవారం కూడా 219 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా రోజుకు 200 చొప్పున కేసులు నమోదవుతున్నట్లుగానే.. సోమవారం కూడా 219 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,193కి చేరింది. ఇవాళ వైరస్ కారణంగా ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 189కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 2,240 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 2,766 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Also Read:ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలకు రూ.2200, లాక్‌డౌన్ ఆలోచన లేదు: ఈటల
సోమవారం హైదరాబాద్‌లో 189, రంగారెడ్డి 13, మేడ్చల్ 2, సంగారెడ్డి 2, వరంగల్ అర్బన్ 4, వరంగల్ రూరల్ 3, మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రి, వనపర్తి, పెద్దపల్లిలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్టుగా తెలంాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు, చికిత్సల కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే వసూలు చేయాలని ఆయన ప్రకటించారు.
లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రైవేట్ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ల్యాబ్ లో పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షల నిర్వహణకుగాను రూ. 2200గా నిర్ణయించినట్టుగా ఆయన చెప్పారు.వెంటిలేటర్‌తో కరోనా రోగికి కరోనా చికి్త్స అందిస్తే ప్రైవేట్ ఆసుపత్రులు రోజుకు రూ. 9 వేలు వసూలు చేయవచ్చన్నారు.
Also Read:కరోనా పరీక్షలకు వెళ్లి 15 రోజులుగా అదృశ్యం: నరేందర్ సింగ్ కుటుంబసభ్యుల ఆందోళన
వెంటిలేటర్ లేకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేస్తే రోజుకు రూ. 7500గా ప్రభుత్వం నిర్ణయం తీసుకొందన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత హైద్రాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు.
కరోనా రోగులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రతి రోజూ రూ. 4 వేలు వసూలు చేయాలని ఆయన సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చినా లక్షణాలు లేకపోతే హొం క్వారంటైన్ లో ఉంటే సరిపోతోందన్నారు.ఐసీఎంఆర్ గుర్తించిన ల్యాబ్స్ ల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. ఐసోలేషన్ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స చేస్తారని ఆయన చెప్పారు.