తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా.. కొత్తగా 2,098 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కొత్తగా 2,098 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ బారి నుంచి నిన్న 3,801 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 29,226 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ అత్యధికంగా 629 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసులు (corona cases in telangana) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 74,083 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,098 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,76,313కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో (corona deaths in telangana) వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 4,099కి చేరింది. కోవిడ్ బారి నుంచి నిన్న 3,801 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 29,226 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ అత్యధికంగా 629 కేసులు నమోదయ్యాయి.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 36, భద్రాద్రి కొత్తగూడెం 75, జీహెచ్ఎంసీ 629, జగిత్యాల 56, జనగామ 34, జయశంకర్ భూపాలపల్లి 12, గద్వాల 6, కామారెడ్డి 19, కరీంనగర్ 60, ఖమ్మం 101, మహబూబ్‌నగర్ 52, ఆసిఫాబాద్ 14, మహబూబాబాద్ 31, మంచిర్యాల 48, మెదక్ 41, మేడ్చల్ మల్కాజిగిరి 98, ములుగు 19, నాగర్ కర్నూల్ 17, నల్గగొండ 86, నారాయణపేట 17, నిర్మల్ 41, నిజామాబాద్ 55, పెద్దపల్లి 49, సిరిసిల్ల 41, రంగారెడ్డి 117, సిద్దిపేట 46, సంగారెడ్డి 59, సూర్యాపేట 62, వికారాబాద్ 22, వనపర్తి 19, వరంగల్ రూరల్ 27, హనుమకొండ 57, యాదాద్రి భువనగిరిలో 52 చొప్పున కేసులు నమోదయ్యాయి.
మరోవైపు భారత్‌లో కరోనా కేసులు (Corona Cases) తగ్గుముఖం పట్టాయి. గత రెండు మూడు రోజులగా రోజువారి కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,27,952 కరోనా కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే 14 శాతం తక్కువగా కొత్త కేసులు ఉన్నాయి. తాజాగా 1,059 కరోనా మరణాలు (Corona Deaths) చోటుచేసుకున్నాయి. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,01,114కి పెరిగింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 2,30,814 కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య 4,02,47,902కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 13,31,648 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదవుతున్న కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కరోనా పాజిటివిటీ రేట్ కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేట్ 11.21 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు.. 95.64 శాతం, యాక్టివ్ కేసులు 3.16 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి.
ఇకపోతే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న (ఫిబ్రవరి 4) దేశవ్యాప్తంగా 47,53,081 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు 1,68,98,17,199 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక, దేశంలో నిన్న 16,11,666 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ మొత్తం 73,58,04,280కి చేరింది.