Asianet News TeluguAsianet News Telugu

Holidays list: వ‌చ్చే ఏడాది ప్ర‌భుత్వ సెల‌వుల జాబితా ఇదే..

Holidays list: 2024 ఏడాదికి గాను సాధారణ, ఐచ్చిక సెలవుల జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2024లో మొత్తంగా 27 సాధారణ సెలవులు, 25 ఐచ్చిక సెలవులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

2024 General Holidays List for Telangana KRJ
Author
First Published Dec 12, 2023, 11:36 PM IST

Holidays list: తెలంగాణ ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను సాధారణ, ఐచ్చిక సెలవులను ప్రకటించింది. సాధారణ పరిపాలన విభాగం జారీ చేసిన నోటిఫికేషన్‌లో 2024లో మొత్తంగా 27 సాధారణ సెలవులు, 25 ఐచ్చిక సెలవులు ఉన్నట్లు ప్రకటించింది. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటో తేదీన సెలవు ప్రకటించన రాష్ట్ర ప్రభుత్వం అందుకు బదులుగా ఫిబ్రవరి 10వ తేదిన రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించింది. 2024 ఫిబ్రవరిలో రెండవ శనివారం మినహా అన్ని నెలల్లో అన్ని ఆదివారాలు, రెండవ శనివారాలు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను సెలవులు ప్రకటించింది.

నెగోషియబుల్ ఇన్‌ట్రుమెంటల్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 23 సాధారణ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు. కాగా.. చంద్రుని దర్శనం ఆధారంగా ఈద్-ఉల్-ఫితర్, ఈద్-ఉల్-అదా, ముహర్రం, మిలాద్-ఉన్-నబీ సెలవుల దినాలను మార్చనున్నారు.
 
సాధారణ సెలవుల జాబితా

  • జనవరి 1: న్యూ ఇయర్ డే
  • జనవరి 14: భోగి
  • జనవరి 15: సంక్రాంతి/పొంగల్
  • జనవరి 26: గణతంత్ర దినోత్సవం
  • మార్చి 8: మహా శివరాత్రి
  • మార్చి 25: హోలీ
  • మార్చి 29: గుడ్ ఫ్రైడే
  • ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు
  • ఏప్రిల్ 9: ఉగాది
  • ఏప్రిల్ 11: ఈద్-ఉల్-ఫితర్
  • ఏప్రిల్ 12: ఈద్-ఉల్-ఫితర్ తర్వాత రోజు
  • ఏప్రిల్ 14: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి
  • ఏప్రిల్ 17: శ్రీరామ నవమి
  • జూన్ 17: ఈద్-ఉల్-అధా
  • జూలై 17: మొహరం
  • జూలై 29: బోనాలు
  • ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం
  • ఆగస్ట్ 26: శ్రీ కృష్ణాష్టమి
  • సెప్టెంబర్ 7: వినాయక చవితి
  • సెప్టెంబర్ 16: మిలాద్ ఉన్ నబీ
  • అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి/బతుకమ్మ ప్రారంభ రోజు
  • అక్టోబర్ 12: విజయ దశమి
  • అక్టోబర్ 13: విజయ దశమి తరువాతి రోజు
  • అక్టోబర్ 31: దీపావళి
  • నవంబర్ 11: కార్తీక పూర్ణిమ/గురునానక్ పుట్టినరోజు
  • డిసెంబర్ 25: క్రిస్మస్
  • డిసెంబర్ 26: బాక్సింగ్ డే

ఐచ్ఛిక సెలవుల జాబితా..

  • జనవరి 16: కనుము
  • జనవరి 25: హజ్రత్ అలీ పుట్టినరోజు
  • ఫిబ్రవరి 8: షబ్-ఎ-మెరాజ్
  • ఫిబ్రవరి 14: శ్రీ పంచమి
  • ఫిబ్రవరి 26: షబ్-ఎ-బారత్
  • మార్చి 31: షాహదత్ హజ్రత్ అలీ
  • ఏప్రిల్ 5: జుమాతుల్ వాడా
  • ఏప్రిల్ 7: షాబ్-ఎ-ఖాదర్
  • ఏప్రిల్ 14: తమిళ నూతన సంవత్సరం/జుముఅతుల్ వాడా
  • ఏప్రిల్ 21: మహావీర్ జయంతి
  • మే 10: బసవ జయంతి
  • మే 23: బుద్ధ పూర్ణిమ
  • జూన్ 25: ఈద్-ఎ-గదీర్
  • జూలై 7: రథ యాత్ర
  • జూలై 16: 9 మొహర్రం
  • ఆగస్టు 15: పార్సీ నూతన సంవత్సర దినోత్సవం
  • ఆగస్టు 16: వరలక్ష్మీ వ్రతం
  • ఆగస్టు 19: శ్రావణ పూర్ణిమ/రాఖీ పూర్ణిమ
  • ఆగస్టు 26: అర్బయీన్
  • అక్టోబర్ 10: దుర్గాష్టమి
  • అక్టోబర్ 11: మహర్నవమి
  • అక్టోబర్ 15: యాజ్ దహమ్ షరీఫ్
  • అక్టోబర్ 30: నరక చతుర్ధి
  • నవంబర్ 16: హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువాన్‌పురి మహదీ మౌద్ పుట్టినరోజు
  • డిసెంబర్ 24: క్రిస్మస్ 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios