Asianet News TeluguAsianet News Telugu

ఆన్‌లైన్ లోన్ యాప్స్: పోలీసుల రిక్వెస్ట్.. 200 యాప్స్‌పై గూగుల్ వేటు

లోన్ యాప్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. 200కి పైగా లోన్ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ తొలగించింది. అలాగే మరో 450కి పైగా లోన్ యాప్స్‌ను తొలగించాలని పోలీసులు గూగుల్‌కు లేఖ రాశారు. 

200 online loan apps removed from google play store ksp
Author
Hyderabad, First Published Jan 16, 2021, 6:34 PM IST

లోన్ యాప్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. 200కి పైగా లోన్ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ తొలగించింది. అలాగే మరో 450కి పైగా లోన్ యాప్స్‌ను తొలగించాలని పోలీసులు గూగుల్‌కు లేఖ రాశారు.

పోలీసుల విజ్ఞప్తితో యాప్స్ తొలగింపు ప్రక్రియను గూగుల్ మొదలుపెట్టింది. హైదరాబాద్ నుంచి 288 యాప్స్ తొలగింపుపై పోలీసులు లేఖ రాశారు. సైబరాబాద్‌లో 110 లోన్ యాప్స్.. రాచకొండ నుంచి 90 లోన్ యాప్స్ తొలగించాలని కోరారు.

Also Read:ఆన్‌లైన్ లోన్‌ యాప్‌లు: సైబర్ క్రైమ్ విచారణ ముమ్మరం

ఇదే సమయంలో వందల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు పోలీసులు. ఇప్పటి వరకు మూడు కమీషనరేట్లలో కలిపి రూ.450 కోట్ల నగదు సీజ్ చేశారు.

ఆన్‌లైన్ బెట్టింగ్‌లో కొట్టేసిన డబ్బుతో చైనీయులు లోన్ యాప్‌లను నడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు చైనీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios