తల్లితో గొడవ పడి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఎల్బీనగర్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కి చెందిన దీనమ్మ(20) అనే యువతి కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది.

కూరగాయాల మార్కెట్లో ఏదో చిన్న విషయంలో దీనమ్మకి తల్లితో గొడవ జరిగింది. చాలా సేపు తల్లీకూతుళ్లు వాగ్వాదం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటికిచేరుకున్న దీనమ్మ.. గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది.

తల్లితో గొడవతో మనస్థాపానికి గురైన దీనమ్మ.. ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోసూసైడ్ నోట్ ఏమీ దొరకలేదని పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.