హైదరాబాద్ ధూల్‌పేటలో అక్రమంగా సిలిండర్ ఫిల్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

హైదరాబాద్ ధూల్‌పేటలో అక్రమంగా సిలిండర్ ఫిల్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన వ్యక్తిని డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి భవనం పాక్షికంగా ధ్వంసమైంది. ధూల్‌పేటలో ఇదే తరహా ఘటనలు గతంలోనూ జరిగి పలువురు మరణించారు. దీనిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దృష్టిపెట్టినా.. నిందితులు పోలీసుల కళ్లుగప్పి దందా కొనసాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులను మానవ సింగ్ (24) నీరజ్ సింగ్ (48)గా గుర్తించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.