నిజామాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. కమ్మర్‌పల్లి జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు  అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.