తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 199 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇవాళ నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,698కి చేరింది.

ఆదివారం కరోనాతో ఐదుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 82కి చేరుకుంది. ఇవాళ జీహెచ్ఎంసీ 122, రంగారెడ్డి జిల్లాలో 40, మేడ్చల్‌లో 10, మహబూబ్‌నగర్ 3, వరంగల్ అర్బన్ 2, సూర్యాపేట 1, నిర్మల్ జిల్లాలో ఒక కేసు నమోదైంది.

మొత్తం కేసుల్లో 434 కేసులు ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారివే. తెలంగాణలో ఇప్పటి వరకు 1,428 మంది డిశ్చార్జ్ అవ్వడంతో 1,188 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.