తెలంగాణ (Telangana)లో కొత్తగా 189 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఇద్దరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 137 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,995 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 36,883 మంది నమూనాలు పరీక్షించగా, 189 కరోనా పాజిటివ్ కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 77 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 12, వరంగల్ అర్బన్ జిల్లాలో 10, కరీంనగర్ జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అదే సమయంలో 137 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,76,376కి చేరుకుంది. అలాగే ఇప్పటివరకు వైరస్ నుంచి 6,68,701 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,680 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కోవిడ్ మృతుల సంఖ్య 3,995కి (corona deaths in telangana) పెరిగింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 10, జీహెచ్ఎంసీ 77, జగిత్యాల 7, జనగామ 3, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 10, ఖమ్మం 4, మహబూబ్‌నగర్ 0, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 3, మంచిర్యాల 1, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 4, ములుగు 1, నాగర్ కర్నూల్ 2, నల్గగొండ 2, నారాయణపేట 1, నిర్మల్ 2, నిజామాబాద్ 0, పెద్దపల్లి 4, సిరిసిల్ల 2, రంగారెడ్డి 12, సిద్దిపేట 5, సంగారెడ్డి 8, సూర్యాపేట 6, వికారాబాద్ 1, వనపర్తి 4, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ 10, యాదాద్రి భువనగిరిలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…