24 గంటల్లో 187 కొత్త కరోనా కేసులు.. తెలంగాణలో 6,67,158కి చేరిన సంఖ్య
తెలంగాణ (Telangana)లో కొత్తగా 187 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) మరణించారు. 170 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 4,406 యాక్టివ్ కేసులు వున్నాయి.
తెలంగాణలో(Telangana) గడిచిన 24 గంటల్లో 39,161 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 187 కొత్త కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,67,158కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా వల్ల ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in telangana) మృతి చెందిన వారి సంఖ్య 3,925కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 170 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 6,58,827కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 4,406 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 4, జీహెచ్ఎంసీ 62, జగిత్యాల 3, జనగామ 4, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 1, కామారెడ్డి 0, కరీంనగర్ 18, ఖమ్మం 9, మహబూబ్‌నగర్ 2, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 3, మంచిర్యాల 6, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 11, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 12, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 2 , పెద్దపల్లి 7, సిరిసిల్ల 4, రంగారెడ్డి 10, సిద్దిపేట 3, సంగారెడ్డి 2, సూర్యాపేట 3, వికారాబాద్ 1, వనపర్తి 0, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 7, యాదాద్రి భువనగిరిలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి.