ఒక మహిళ నిర్లక్ష్యంగా కారు నడపడం వలన ఒక పసిపాప ప్రాణాలు కోల్పోయింది. ఊహించని విధంగా జరిగిన ఈ ఘటన నగర వాసులను షాక్ కి గురి చేసింది. ఏకైక సంతానమైన చిన్నారి మరణ వార్త కుటుంబ సభ్యులను తీరని విషాదాన్ని మిగిల్చింది. యాక్సిడెంట్ కి కారణమైన మహిళను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనవంకకు చెందిన బోనం హనుమారెడ్డి, భారతి దంపతులు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో నివాసముంటున్నారు. వీరికి 18 నెలల పాప కూడా ఉంది. అయితే అయితే శుక్రవారం తన కూతురిని బైక్ పై బయటకు తీసుకువెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో వారి బైక్ ని ఒక కారు డి కొట్టింది. జరిగిన కారు ప్రమాదంలో చిన్నారు గగనకు తీవ్రంగా గాయాలయ్యాయి.

వెంటనే ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే చిన్నారి ప్రాణం కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో గగన తల్లి దండ్రులు బాధతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఒక్కగానొక్క ఒక్క కూతురు కళ్ళముందే ప్రాణాలు కోల్పోవడం తల్లి దండ్రులను తీవ్రంగా కలచివేసింది. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నడిపిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కారును నడిపిన మహిళతో ఆమె భర్త కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె డ్రైవింగ్ నేర్చుకుంటున్నట్లు  ఆదిభట్ల ఠాణా ఎస్సై సురేష్‌కుమార్‌ తెలియజేశారు.

భార్యను చితకబాది చంపిన భర్త: కూతురిని తీసుకుని పరారీ