హైదరాబాద్: ఆమెకు 20 ఏళ్లు. ఇంటర్మీడియట్ చదివే ఓ మైనర్ బాలుడిని ప్రేమించింది. వీరిద్దరు పెద్దలను ఎదిరించి మరీ హద్దులుదాటి సహజీవనం చేశారు. అయితే నెలరోజులు కూడా గడవకుండానే ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ లోని యూసఫ్ గూడ ప్రాంతంలో ఓ పోలీస్ శాఖ ఉద్యోగి కుటుంబంతో కలిసి నివాసం వుంటున్నాడు. అతడికి ఇంటర్మీడియట్ చదివే ఓ కొడుకు వున్నాడు. అయితే 17ఏళ్ల ఈ మైనర్ బాలుడు అదే ప్రాంతంలో నివాసముండే ఓ 20ఏళ్ళ యువతితో ప్రేమాయణం సాగించాడు. వీరి ప్రేమ విషయం తెలిసి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించపోవడంతో ఇంటినుండి పారిపోయారు. జవహర్ నగర్ లో ఓ గదిని అద్దెకు తీసుకుని సహజీవనం చేయడం ప్రారంభించారు. 

read more ఉరేసుకుంటూ వీడియో... భార్య కోసం ప్రాణాలమీదకు తెచ్చుకున్న భర్త

ఈ క్రమంలో నెలరోజులు కూడా గడవకుండానే ఈ ప్రేమజంట మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అవికాస్తా ఇటీవల తారాస్థాయికి చేరడంతో ఇక కలిసి బ్రతకడం కుదరదని భావించి కలిసి చద్దామని నిర్ణయించుకున్నారు. శనివారం ఇద్దరు గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకోగా బాలుడు చనిపోయాడు. ఉరేసుకున్న చున్నీ ఊడిపోవడంతో యువతి ప్రాణాలతో భయటపడింది.