తెలంగాణ (Telangana)లో కొత్తగా 177 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 190 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 4,470 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 38,219 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 177 పాజిటివ్‌ కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బారినపడిన వారి సంఖ్య 6,80,251కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కోవిడ్‌తో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్ వల్ల మృతిచెందిన సంఖ్య 4,018కి చేరింది. మహమ్మారి బారి నుంచి (corona deaths in telangana) నిన్న 190 మంది కోలుకున్నారు. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం రికవరీల సంఖ్య 6,72,637కి చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,470 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 648 మంది శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కొవిడ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా ఆరుగురు ప్రయాణికులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఈ రోజు రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాలేదు. ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి మొత్తంగా 10,029 మంది తెలంగాణకు వచ్చారు. వారిలో కొవిడ్‌ పాజిటివ్ వచ్చిన 70 మంది శాంపిల్స్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించగా.. వారిలో 22 మందికి ఒమిక్రాన్‌ నెగెటివ్‌ రాగా.. 38 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 10 మంది ఫలితాలు రావాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 3, జీహెచ్ఎంసీ 93, జగిత్యాల 0, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 3, ఖమ్మం 4, మహబూబ్‌నగర్ 5, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 3, మంచిర్యాల 2, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 9, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 5, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 4, పెద్దపల్లి 4, సిరిసిల్ల 1, రంగారెడ్డి 16, సిద్దిపేట 4, సంగారెడ్డి 7, సూర్యాపేట 0, వికారాబాద్ 1, వనపర్తి 1, వరంగల్ రూరల్ 1, హనుమకొండ 7, యాదాద్రి భువనగిరిలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి

Scroll to load tweet…